మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
- కొండా సురేఖ తనపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్ పరువు నష్టం కేసు
- కేసులో విచారణకు హాజరు కాని కొండా సురేఖ
- తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
పిటిషన్‌పై విచారణ సందర్భంగా కొండా సురేఖ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి ఐదో తేదీలోపు కొండా సురేఖ నేరుగా కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.