తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అతిథుల కోసం నోరూరించే వంటకాలు
- తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరైన అతిథులకు విందు భోజనం
- తాజ్ హోటల్స్ ఆధ్వర్యంలో వంటకాల తయారీ, ఏర్పాట్లు
- తెలంగాణ సంప్రదాయ వంటకాలతో పాటు పాశ్చాత్య రుచులు
- హైదరాబాదీ బిర్యానీ, సకినాలు, ఖుబానీ కా మీఠా ప్రధాన ఆకర్షణ
- అంతర్జాతీయ ప్రమాణాలతో పరిశుభ్రతకు పెద్దపీట
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరైన దేశ, విదేశీ అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన విందు ఏర్పాటు చేసింది. తెలంగాణ సంప్రదాయ ఆతిథ్యాన్ని చాటిచెప్పేలా, ప్రముఖ తాజ్ హోటల్స్ ఆధ్వర్యంలో నోరూరించే వంటకాలను సిద్ధం చేశారు. స్థానిక రుచులతో పాటు అంతర్జాతీయ వంటకాలను మేళవించి ప్రత్యేక మెనూను రూపొందించారు.
ఈ విందులో తెలంగాణ వంటకాలకు పెద్దపీట వేశారు. హైదరాబాదీ దమ్ బిర్యానీ, మటన్ కర్రీ, ఖుబానీ కా మీఠా వంటి వంటకాలతో పాటు, విదేశీ అతిథులను దృష్టిలో ఉంచుకుని గ్రిల్డ్ ఫిష్, రోస్ట్ చికెన్ వంటి పాశ్చాత్య వంటకాలను కూడా మెనూలో చేర్చారు. భోజనంతో పాటు అల్పాహారం, స్నాక్స్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సకినాలు, ఇప్పపువ్వు లడ్డూ, ఉస్మానియా బిస్కెట్లు వంటి తెలంగాణ చిరుతిళ్లను ప్రత్యేకంగా అందించారు. పండ్లతో అక్కడికక్కడే కోల్డ్ ప్రెస్ జ్యూస్‌లు తయారు చేసి సర్వ్ చేశారు.
ఈ ఏర్పాట్ల కోసం తాజ్ హోటల్స్‌కు చెందిన 450 మంది సిబ్బంది బృందం వారం రోజుల ముందు నుంచే సన్నద్ధమైంది. తాజ్ హోటల్స్ ఎగ్జిక్యూటివ్ షెఫ్ గణేశ్ మాట్లాడుతూ, "అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలు పాటిస్తూ పూర్తి పరిశుభ్రమైన వాతావరణంలో వంటకాలను సిద్ధం చేశాం. అతిథుల కోసం అన్ని పదార్థాలను అక్కడికక్కడే తాజాగా వండి వడ్డించాం" అని వివరించారు.
తెలంగాణ సంప్రదాయ, ఆధునిక రుచుల మేళవింపుతో కూడిన ఈ విందు అతిథులను ఎంతగానో ఆకట్టుకుంది.