'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'... మొదటిరోజు రూ.1.88 లక్షల కోట్ల ఒప్పందాలు

  • డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులు
  • డీప్ టెక్నాలజీ రంగంలో రూ.75 వేల కోట్ల పెట్టుబడులు
  • ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో రూ.19,350 కోట్ల పెట్టుబడులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025' మొదటి రోజున భారీగా అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదిరాయి. రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం, ఫ్యూచర్ సిటీలో జరిగిన ఈ సదస్సులో వివిధ కంపెనీలతో రూ.1.88 లక్షల కోట్ల మేర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ సహా వివిధ రంగాల్లో ఆయా కంపెనీలు పెట్టుబడులకు ముందుకు వచ్చాయి.

డీప్ టెక్నాలజీ రంగంలో రూ.75 వేల కోట్లు, గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.27 వేల కోట్లు, పునరుత్పాదక రంగంలో రూ.39,700 కోట్లు, ఏరోస్పోస్, డిఫెన్స్ రంగాల్లో రూ.19,350 కోట్లు, ఏవియేషన్ రంగంలో జీఎంఆర్ గ్రూపుతో రూ.15 వేల కోట్లు, తయారీ రంగంలో రూ.13,500 కోట్లు, ఉక్కు రంగంలో రూ.7 వేల కోట్లు, టెక్స్‌టైల్స్ రంగంలో రూ.4 వేల కోట్ల మేర ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం వెల్లడించింది.


More Telugu News