2026 ఏడాదికి సెలవులు ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం

  • 27 సాధారణ సెలవులు, 26 ఐచ్ఛిక సెలవులు తెలంగాణ
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి
  • భోగి మొదలు క్రిస్‌మస్ మరుసటి రోజు వరకు 27 సాధారణ సెలవులు
2026 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధారణ మరియు ఐచ్ఛిక సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తంగా 27 సాధారణ సెలవులు, 26 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వం ప్రకటించిన సాధారణ సెలవుల్లో భోగి, సంక్రాంతి, గణతంత్ర్య దినోత్సవం, మహాశివరాత్రి, హోలి, ఉగాది, రంజాన్, శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే, బాబు జగ్జీవన్ రామ్ జయంతి, డాక్టర్ అంబేడ్కర్ జయంతి, బక్రీద్, మొహర్రం, బోనాలు, స్వాతంత్ర్య దినోత్సవం, ఈద్ మిలాద్ ఉన్ నబీ, శ్రీ కృష్ణాష్టమి, వినాయక చవితి, మహాత్మా గాంధీ జయంతి, సద్దుల బతుకమ్మ, విజయ దశమి, దీపావళి, కార్తీక పౌర్ణమి, క్రిస్‌మస్‌ ఉన్నాయి. రంజాన్, విజయదశమి, క్రిస్‌మస్ పండుగల మరుసటి రోజు కూడా సాధారణ సెలవుగా ప్రకటించింది.


More Telugu News