మీ నిర్ణయాలు భేష్... కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని ప్రశంసించిన ప్రధాని మోదీ

  • ఇండిగో సంక్షోభం వేళ మంత్రి రామ్మోహన్ నాయుడికి ప్రధాని కితాబు
  • సమయస్ఫూర్తితో వ్యవహరించారంటూ మోదీ నుంచి ప్రశంసలు
  • విమర్శలను పట్టించుకోవద్దని రామ్మోహన్‌కు ప్రధాని సూచన
  • ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు
ఇండిగో విమానాల సంక్షోభం నేపథ్యంలో విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పూర్తి మద్దతు లభించింది. ఈ క్లిష్ట సమయంలో సమర్థంగా వ్యవహరిస్తున్నారంటూ మంత్రి పనితీరును ప్రధాని స్వయంగా ప్రశంసించారు.

ఇండిగో సమస్యపై రామ్మోహన్ నాయుడు సమయస్ఫూర్తితో వ్యవహరించారని, శాఖాపరంగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నారని మోదీ కితాబిచ్చారు. ప్రస్తుతం వస్తున్న విమర్శలు, ఆరోపణలను పట్టించుకోకుండా ముందుకు సాగాలని రామ్మోహన్ నాయుడికి ప్రధాని మోదీ సూచించారు. 

గత వారం రోజులుగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన వందలాది విమానాలు రద్దు కావడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి క్రమంగా అదుపులోకి వస్తోంది.

ఈ సంక్షోభంపై కేంద్రం తీసుకుంటున్న చర్యల గురించి మంత్రి రామ్మోహన్ నాయుడు నేడు రాజ్యసభలో వివరణ ఇచ్చారు. ఈ తరుణంలో స్వయంగా ప్రధాని మోదీయే ఆయనను ప్రశంసించడం ప్రాధాన్యత సంతరించుకుంది.


More Telugu News