ఆమె పక్కన కూర్చోవాలంటే సిగ్గేసేది.. సమంతపై రాజ్ నిడిమోరు పిన్ని శోభారాజు ఆసక్తికర వ్యాఖ్యలు
- సామ్-రాజ్ పెళ్లిపై ఆసక్తికర విషయాలు వెల్లడించిన శోభారాజు
- సమంత డైట్, క్రమశిక్షణ చూసి భయపడ్డానన్న రాజ్ పిన్ని
- వివాహంలో 'క్లేశ నాశన' అనే ప్రత్యేక ఆధ్యాత్మిక క్రతువు
- అతిథులకు సాత్వికాహారం, సహజ సిద్ధమైన పర్‌ఫ్యూమ్స్ గిఫ్ట్
- వివాహం తర్వాత తమ ప్రాజెక్టులతో బిజీ అయిన నూతన జంట
నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరుల వివాహం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రాజ్ పిన్ని, ప్రముఖ గాయని శోభారాజు వీరి వివాహం, సమంత క్రమశిక్షణపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఆహారం విషయంలో సమంత ఎంతో క్రమశిక్షణతో ఉంటుందని శోభారాజు తెలిపారు. “సామ్ డైట్ గురించి వింటే భయమేసేది. ఆమె పక్కన కూర్చోవాలంటే సిగ్గేసేది. మూడు నెలలకు ఒకసారి ఈశా యోగా కేంద్రానికి వెళ్లి ధ్యానం చేస్తుందని తెలిసింది. ఆమె ఆధ్యాత్మిక చింతన, ఫిట్‌నెస్ పట్ల నిబద్ధత గొప్పవి” అని శోభారాజు నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. తన అక్క కుమారుడైన రాజ్ కూడా ఇలాంటి విషయాల్లో చాలా క్రమశిక్షణతో ఉంటాడని, ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండటం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.
ఈ వివాహంలో ‘క్లేశ నాశన’ అనే ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక క్రతువును నిర్వహించినట్లు ఆమె వెల్లడించారు. వేడుకకు హాజరైన అతిథులకు పూర్తిగా సాత్విక ఆహారాన్ని అందించారని, బహుమతిగా సహజసిద్ధమైన పర్‌ఫ్యూమ్స్‌ను ఇచ్చారని వివరించారు. పెళ్లి దుస్తుల్లో సమంత అసాధారణమైన అందంతో కనిపించిందని ఆమె ప్రశంసించారు.
వివాహ వేడుకలు ముగియడంతో సమంత, రాజ్ తిరిగి తమ వృత్తిపరమైన పనులతో బిజీ అయ్యారు. సమంత ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ సినిమా నిర్మాణంతో పాటు నటిస్తుండగా, రాజ్ దర్శకత్వం వహించిన ‘ది ఫ్యామిలీమ్యాన్ 3’ వెబ్ సిరీస్ భారీ విజయాన్ని అందుకుంది.