'మళ్లీ లావుగా అయిపోతాను'.. కేక్‌కు దూరంగా పరుగెత్తిన రోహిత్.. ఇదిగో వీడియో!

  • దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా
  • విజయోత్సవంలో భాగంగా హోటల్‌లో కేక్ కట్ చేసిన ఆటగాళ్లు
  • యశస్వి జైస్వాల్ అందించిన కేక్‌ను స్వీకరించిన కోహ్లీ
  • కేక్ తింటే లావైపోతానంటూ సున్నితంగా తిరస్కరించిన రోహిత్ 
  • ఫిట్‌నెస్‌పై హిట్‌మ్యాన్ క్రమశిక్షణకు నిదర్శనమంటున్న ఫ్యాన్స్
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచిన ఆనందంలో టీమిండియా ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా హోటల్‌లో కేక్ కట్ చేయగా, ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కేక్ స్వీకరించగా, కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తన ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకుని సున్నితంగా తిరస్కరించాడు.

వైజాగ్‌లో జరిగిన చివరి, నిర్ణయాత్మక వన్డేలో సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌తో టీమ్ మేనేజ్‌మెంట్ కేక్ కట్ చేయించింది. అనంతరం జైస్వాల్ మొదటగా విరాట్ కోహ్లీకి కేక్ తినిపించారు. కఠినమైన డైట్ పాటించే కోహ్లీ సైతం విజయోత్సాహంలో భాగంగా ఆ కేక్‌ను తిన్నాడు.

ఆ తర్వాత టీమ్‌లోని మరో సీనియర్ సభ్యుడైన రోహిత్ శర్మకు కేక్ ఇవ్వబోగా, ఆయన వద్దన్నాడు. "వద్దు భాయ్, నేను మళ్లీ లావుగా అయిపోతాను" అంటూ హిందీలో నవ్వుతూ చెప్పడంతో అక్కడున్న వారందరూ నవ్వేశారు.

టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలిగినప్పటి నుంచి రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్‌పై పూర్తిగా దృష్టి సారించిన విషయం తెలిసిందే. కఠినమైన డైట్ పాటిస్తూ ఆయన ఇప్పటికే 10 కిలోలకు పైగా బరువు తగ్గాడు. తన ఫిట్‌నెస్ నియమాలను ఎంత కఠినంగా పాటిస్తున్నాడ‌నే దానికి ఈ చిన్న సంఘటనే నిదర్శనమని అభిమానులు చెబుతున్నారు.


More Telugu News