20,000 పరుగుల క్లబ్ లో చేరిన రోహిత్ శర్మ.. నాలుగో భారత క్రికెటర్
- సచిన్, ద్రావిడ్, కోహ్లీ తర్వాత ఫీట్ సాధించిన నాలుగో ఆటగాడు
- 14వ ఓవర్లో నాలుగో బంతికి సింగిల్ తీసి మైలురాయి చేరుకున్న రోహిత్ శర్మ
- వన్డేల్లో 11,468, టెస్టుల్లో 4,301, టీ20ల్లో 4,231 పరుగులు చేసిన హిట్ మ్యాన్
రోహిత్ శర్మ 20,000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి ఈ రోజు మ్యాచ్లో మరో 27 పరుగులు చేయాల్సి ఉండగా, మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే వేగంగా పరుగులు సాధించి సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీల తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగవ ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
కేశవ్ మహరాజ్ వేసిన 14వ ఓవర్లో నాలుగవ బంతికి రోహిత్ శర్మ సింగిల్ తీసి ఈ ఘనతను అందుకున్నాడు. వన్డేల్లో 11,468, టెస్టుల్లో 4,301, టీ20ల్లో 4,231 పరుగులు అతడి ఖాతాలో ఉన్నాయి. ప్రపంచ క్రికెటర్లలో ఈ ఘనత సాధించిన 14వ ఆటగాడుగా రోహిత్ శర్మ నిలిచాడు.