ఎన్‌టీఆర్ జిల్లాలో బర్త్ డే పార్టీలో వివాదం.. ఒకరి హత్య
- జగ్గయ్యపేట సమీపంలోని చిల్లకల్లులో ఘటన
- పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య చెలరేగిన వివాదం
- కత్తితో పొడిచి చంపిన మరో రౌడీ షీటర్
- హత్య వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన నిందితుడు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. పుట్టినరోజు వేడుకలో తలెత్తిన చిన్న వివాదం ఒక సస్పెక్ట్ షీటర్ హత్యకు దారితీసింది. స్నేహితుడినే అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, తానే ఒక ‘వాంటెడ్ క్రిమినల్’ అని ప్రకటించుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే, విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్‌గా నమోదైన పిల్ల సాయి తన స్నేహితులతో కలిసి చిల్లకల్లులో ఒక పుట్టినరోజు పార్టీలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమానికి భవానీపురం పీఎస్‌లో సస్పెక్ట్ షీటర్‌గా ఉన్న అలవల నవీన్ రెడ్డి కూడా హాజరయ్యాడు. పార్టీ జరుగుతున్న సమయంలో పిల్ల సాయి, నవీన్ రెడ్డి మధ్య మాట మాట పెరిగి ఘర్షణ మొదలైంది.
ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన పిల్ల సాయి, నవీన్ రెడ్డిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో నవీన్ రెడ్డి కుప్పకూలిపోగా, పిల్ల సాయి అనుచరులు అతడిని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి గేటు బయట వదిలేసి పరారయ్యారు. కొద్దిసేపటికే నవీన్ రెడ్డి మృతి చెందాడు.
అనంతరం, నవీన్ రెడ్డిని పొడుస్తున్న వీడియోలను పిల్ల సాయి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. "నేనే వాంటెడ్ క్రిమినల్" అంటూ క్యాప్షన్ పెట్టి పలువురికి షేర్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.