Kokapet: కోకాపేటలో మరోసారి కోట్లు పలికిన భూములు.. రూ.131 కోట్లు ఎకరా భూమి
- నియోపొలిస్ భూములకు ముగిసిన మూడో విడత వేలం
- ఫ్లాట్ నెంబర్ 19లో ఎకరా రూ.131 కోట్లు, ఫ్లాట్ నెంబర్ 20లో ఎకరా రూ.118 కోట్లు
- మూడు విడతల్లో సమకూరిన రూ.3,708 కోట్ల ఆదాయం
హైదరాబాద్ పరిసర ప్రాంతమైన కోకాపేటలో భూములు మరోసారి కోట్లాది రూపాయలు పలికాయి. ఫ్లాట్ నెంబర్ 19లో ఎకరా భూమి ఏకంగా రూ.131 కోట్లకు అమ్ముడుపోయింది. మొత్తం నాలుగు ఎకరాల భూమిని వేలం వేయగా ప్రభుత్వానికి రూ.524 కోట్ల ఆదాయం సమకూరింది. అదేవిధంగా, ఫ్లాట్ నెంబర్ 20లో కూడా వేలం నిర్వహించారు. కోకాపేటలోని నియోపొలిస్ భూములకు సంబంధించి ఈరోజు మూడో విడత వేలం ప్రక్రియ ముగిసింది.
ఈ వేలంలో ఫ్లాట్ నెంబర్ 19లో ఎకరా భూమి రూ.131 కోట్లు, ఫ్లాట్ నెంబర్ 20లో ఎకరం రూ.118 కోట్ల ధర పలికింది. ఈరోజు జరిగిన వేలంలో 8.04 ఎకరాలకు గాను హెచ్ఎండీఏకు సుమారు రూ. వెయ్యి కోట్ల ఆదాయం వచ్చింది.
మొత్తంగా మూడు విడతల్లో ఆరు ప్లాట్లలోని 27 ఎకరాలకు రూ.3,708 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి మొత్తం 44 ఎకరాల భూమిని నాలుగు విడతల్లో హెచ్ఎండీఏ వేలం వేస్తోంది. కోకాపేట గోల్డెన్ మైల్‌లోని 2 ఎకరాలు, మూసాపేటలోని 15 ఎకరాలకు డిసెంబర్ 5న ఈ-వేలం నిర్వహించనున్నారు.