‘దండోరా’ మ్యూజికల్ జర్నీ షురూ.. ఆకట్టుకుంటున్న 'పిల్లా' సాంగ్
- 'దండోరా' సినిమా నుంచి తొలి సింగిల్ 'పిల్లా' సాంగ్ విడుదల
- మార్క్ కె రాబిన్ సంగీతం, అనురాగ్ కులకర్ణి, ఆదిత్య భవరాజు గానం
- పూర్ణాచారి సాహిత్యం
- రవికృష్ణ, మణిక చిక్కాల మధ్య చక్కటి కెమిస్ట్రీ
- డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'దండోరా'. ఈ సినిమా నుంచి మ్యూజికల్ ప్రమోషన్లు మొదలయ్యాయి. ఇందులో భాగంగా తొలి పాట 'పిల్లా' సాంగ్' లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటకు ఆడియన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది.
మార్క్ కె రాబిన్ స్వరపరిచిన ఈ మెలోడీని అనురాగ్ కులకర్ణి, ఆదిత్య భవరాజు ఆలపించగా, పూర్ణాచారి సాహిత్యం అందించారు. టీ-సిరీస్ మ్యూజిక్ ద్వారా ఈ పాట విడుదలైంది.
ఈ పాట కథలో చాలా కీలకమైన సందర్భంలో వస్తుంది. హీరో ప్రేమను హీరోయిన్ మాటల్లో చెప్పకుండా, పరోక్షంగా అంగీకరించే సున్నితమైన సన్నివేశాన్ని ఈ పాట ద్వారా చూపించారు. మృదువైన జానపద బాణీలో, సంభాషణ రూపంలో సాగే సాహిత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జేడీ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ కూడా పాటలోని భావానికి తగ్గట్టుగా సింపుల్ స్టెప్స్‌తో ఉంది.
లిరికల్ వీడియోలో రవికృష్ణ, మణిక చిక్కాల మధ్య కెమిస్ట్రీ సహజంగా పండింది. వారి హావభావాలు, టైమింగ్ పాటకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. మురళీకాంత్ దేవసోత్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వెంకట్ ఆర్. శకమూరి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. డిసెంబర్ 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.