‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్... బాలకృష్ణ పవర్‌ఫుల్ స్పీచ్ ఇదిగో!
- అఖండ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ పవర్‌ఫుల్ స్పీచ్
- నేనే చరిత్ర.. నాదే ఆ చరిత్ర అంటూ గర్జించిన బాలయ్య
- బాలయ్యతో సినిమా అంటే టెన్త్ పరీక్షలు రాసినట్లేనన్న తమన్
- బోయపాటి వల్లే నా కెరీర్ మారిందన్న ఆది పినిశెట్టి
- డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా అఖండ తాండవం విడుదల
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘అఖండ 2 – తాండవం’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కైతలాపూర్ గ్రౌండ్స్‌లో అశేష అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలకృష్ణతో పాటు హీరోయిన్ సంయుక్త మీనన్, విలన్‌గా నటిస్తున్న ఆది పినిశెట్టి, సంగీత దర్శకుడు తమన్, చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖండ-2 తాండవం టీజర్ కూడా విడుదల చేశారు.
బాలయ్య స్పీచ్‌తో దద్దరిల్లిన వేదిక
ఈవెంట్‌లో అభిమానుల కేరింతల మధ్య వేదికపైకి వచ్చిన బాలకృష్ణ తనదైన శైలిలో ప్రసంగించి అందరిలోనూ ఉత్సాహం నింపారు. ఇటీవల తాను నటిస్తున్న #NBK111 చిత్రంలోని డైలాగ్‌ను ఈ వేదికపై మరోసారి చెప్పి అభిమానులను ఉర్రూతలూగించారు. "చరిత్రలో చాలామంది ఉంటారు. కానీ, చరిత్రను తిరగరాసి మళ్లీ చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే ఉంటాడు. నేనే చరిత్ర.. నాదే ఆ చరిత్ర" అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌కు అభిమానుల ఈలలు, చప్పట్లతో ప్రాంగణం మార్మోగింది. ఈ డైలాగ్ రాబోయే సినిమాల్లో తన పాత్ర ఎంత శక్తివంతంగా ఉండబోతుందో చెప్పకనే చెప్పింది. చిత్ర బృందానికి, నిర్మాతలకు, దర్శకుడికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మీతో నాకున్నది జన్మజన్మల బంధం: బాలకృష్ణ
'అఖండ తాండవం' పేరుతో జరిగిన నా 'అఖండ 2' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు తరలివచ్చిన వేల, లక్షల కోట్ల నా అభిమాన సోదరులకు, మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. మీతో నాకున్నది జన్మజన్మల అనుబంధం. ఈ రోజు మనిషి జీవితంలో అన్నం, నీళ్లతో పాటు సినిమా కూడా ఒక భాగమైపోయింది. అందుకే సినిమా ద్వారా ఒక మంచి సందేశం ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది.
ఈ రోజు నేను ఇక్కడున్నానంటే దానికి కారణం నా తండ్రి, నా గురువు, నా దైవం అయిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ నందమూరి తారకరామారావు గారు. ఆయన ఆశీస్సులతోనే నేను ముందుకు సాగుతున్నాను. ఒక నటుడిగా, హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా బహుళ బాధ్యతలు నిర్వర్తించగలుగుతున్నాను.
2021లో కరోనాతో థియేటర్లకు జనం రారన్నప్పుడు, మేం 'అఖండ'తో వచ్చాం. చరిత్ర సృష్టించాం. నటనంటే కేవలం నవ్వడం, ఏడ్పించడం కాదు. అది ఒక ఆత్మ నుంచి మరో ఆత్మలోకి పరకాయ ప్రవేశం చేయడం. మొదటి భాగంలో ధర్మం దారి తప్పితే దేవుడు మనిషిలో ఆవహించాడు. కానీ ఈ 'అఖండ 2'లో ధర్మం ఇంకా మితిమీరినప్పుడు, మనిషే ఆ దైవాన్ని తనలో ఆవాహన చేసుకుంటాడు. మహాశివుడి సాక్షిగా, పార్వతి శక్తి తోడుగా నా పాత్ర రుద్ర తాండవం చేస్తుంది.
మా సినిమాలోని 15 నిమిషాల సన్నివేశాలు చూసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు "అద్భుతంగా ఉంది, సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పారు" అని అభినందించారు. సనాతన ధర్మం అంటే కేవలం పూజలు చేయడం కాదు, అన్యాయం జరిగినప్పుడు తలవంచకుండా ఎదురించి సమాధానం చెప్పడమే నిజమైన ధర్మం.
దర్శకుడు బోయపాటి శ్రీనుతో నాది ప్రత్యేక అనుబంధం. మేం సినిమా చేయాలనుకుంటే మూడు నిమిషాలు మాట్లాడుకుంటాం, ఆ తర్వాత నేరుగా రంగంలోకి దిగుతాం. ఈ సినిమాకు అద్భుత సంగీతం అందించిన తమన్‌కు, నటీనటులు సంయుక్తా మీనన్, మురళీ మోహన్ గారికి, సాంకేతిక నిపుణులకు నా అభినందనలు.
చివరగా, నా అభిమానులకు నేను మనస్ఫూర్తిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. సినిమా విజయాన్ని సంబరాలు చేసుకోండి, కానీ వేటలు కొట్టడం, జీవహింస చేయడం వంటివి దయచేసి చేయవద్దు. నాలుగు పాదాలు (చతుష్పతే), రెండు పాదాలు (ద్విపదే) ఉన్న ప్రతి జీవిని గౌరవించండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు... అంటూ బాలకృష్ణ ప్రసంగించారు.
మాకు బాలయ్య గారే ఆస్తి: బోయపాటి శ్రీను
ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ సినిమాపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. '''అఖండ 2' సినిమా షూటింగ్‌కు సహకరించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు నా కృతజ్ఞతలు. మాకు బాలయ్య గారే ఆస్తి, ఆయనే మా పవర్, ఆయనే మా ధైర్యం. హీరోయిన్ సంయుక్త మీనన్, ఆది పినిశెట్టితో పాటు ఛటర్జీ, మురళీ మోహన్, మహేంద్రన్, కబీర్ సింగ్, రచ్చ రవి, పూర్ణ.. ఇలా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేను ఎప్పుడూ ఎమోషన్‌ను, దాని నుంచి వచ్చే యాక్షన్‌ను నమ్ముతాను. రామ్ లక్ష్మణ్, రాహుల్, రవి వర్మ అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు సృష్టికి ప్రతిసృష్టి చేశారు. తమన్‌తో నా జర్నీ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. డీఓపీలు రాంప్రసాద్, సంతోష్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు'' అని తెలిపారు.
సినిమా సెన్సార్ వివరాలను కూడా ఆయన పంచుకున్నారు. ''అఖండ-2 సెన్సార్ పూర్తయింది. చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ సభ్యులు చాలా గౌరవంగా అభినందించారు. 'మీరు ఈ సినిమాతో ఒక గౌరవమైన స్థానంలో ఉంటారు సార్' అని నాతో చెప్పారు'' అని బోయపాటి పేర్కొన్నారు. సినీ పరిశ్రమ ఏ ఒక్కరిదీ కాదని, ఇక్కడ కులమత బేధాలు ఉండవని, మంచి సినిమా ఎప్పుడూ గెలవాలని ఆయన ఆకాంక్షించారు.
బాలయ్యతో సినిమా అంటే టెన్త్ పరీక్షలు రాసినట్లే: తమన్
సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించారు. "అరుణాచలం దర్శనం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. అలాగే ఈ అఖండ చేయాలంటే చాలా బలం కావాలి. ఇది నా మ్యూజిక్ కాదు, ఆ శివుడే నాతో చేయిస్తున్నాడు. ‘అఖండ 1’కే అన్నీ చేసేశాం, ఇక పార్ట్ 2కి ఏం చేస్తాం అనుకున్నా. కానీ బోయపాటి గారు, బాలయ్య గారు -14 డిగ్రీల చలిలో కష్టపడ్డారు. శివుడి రూపంలో ఉన్న బాలయ్య గారిని చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి," అని భావోద్వేగంగా అన్నారు.
అదే సమయంలో, "బాలయ్య గారితో సినిమా అంటే టెన్త్ పరీక్షలు రాసినట్లే. ఏం చేయాలని నిరంతరం ఆలోచిస్తూనే ఉండాలి. దయచేసి మీరంతా మీ స్పీకర్లను సర్వీస్ చేయించి పెట్టుకోండి" అంటూ చమత్కరించారు. ఈ సినిమా తర్వాత నటుడిగా ఆది పినిశెట్టికి గొప్ప పేరు వస్తుందని థమన్ జోస్యం చెప్పారు.
బోయపాటి వల్లే నా కెరీర్ మారింది: ఆది పినిశెట్టి
ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న ఆది పినిశెట్టి మాట్లాడుతూ, "తెలుగులో నా కెరీర్ ఇంత బాగుందంటే దానికి కారణం బోయపాటి శ్రీను గారే. ‘సరైనోడు’లో వైరం ధనుష్ పాత్ర నా కెరీర్‌ను మార్చేసింది. మళ్లీ ఆయన సినిమాలో అవకాశం రావడం సంతోషంగా ఉంది. బాలయ్య గారు మోస్ట్ కూలెస్ట్, యంగెస్ట్ యాక్టర్. ఆయనతో పనిచేయడం గొప్ప అనుభవం" అని తెలిపారు.
హీరోయిన్ సంయుక్త మీనన్ మాట్లాడుతూ, "ఈ సినిమాలో అవకాశం రావడం శివుడి ఆశీర్వాదంగా భావిస్తున్నాను. బోయపాటి గారు చెప్పే ‘యాక్షన్’, ‘కట్’లోనే ఎంతో ఎనర్జీ ఉంటుంది. బాలయ్య గారు సెట్‌లో ఉంటే ఆ శక్తి రెట్టింపు అవుతుంది" అని తన ఆనందాన్ని పంచుకున్నారు.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ‘అఖండ 2 – తాండవం’ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.