హైదరాబాద్‌లో మరోసారి రికార్డు ధర... కోకాపేటలో ఎకరం రూ.150 కోట్లు

  • గండిపేట మండలం కోకాపేటలో ఎకరం భూమి రూ.151.25 కోట్లు
  • నియోపొలిస్ లేఅవుట్ ప్లాట్ నెంబర్ 15, 16లో వేలం
  • 9.06 ఎకరాలను వేలం వేయగా సమకూరిన రూ.1,353 కోట్ల ఆదాయం
హైదరాబాద్ నగర శివారులోని కోకాపేటలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా జరిగిన వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.150 కోట్లకు పైగా పలికింది. గండిపేట మండలం పరిధిలోని కోకాపేటలో ఇటీవల భూముల ధరలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో కోకాపేట నియోపొలిస్ లేఅవుట్‌లో నిర్వహించిన ఈ-వేలంలో ఎకరం భూమి ధర రూ.151.25 కోట్లకు చేరింది.

నియోపొలిస్‌లోని ప్లాట్ నెంబర్ 15, 16లలోని 9.06 ఎకరాలను ప్రభుత్వం వేలం వేయగా రూ.1,353 కోట్ల ఆదాయం లభించింది. గతంలో ప్లాట్ నెంబర్ 17, 18లను వేలం వేయగా ఎకరం రూ.137.25 కోట్లు పలికింది. అంతకుముందు టీజీఐఐసీ భూముల్లో ఎకరా ధర రూ.177 కోట్లుగా నమోదైన విషయం విదితమే. నియోపొలిస్‌లో 2023లో ఎకరా భూమి సగటున రూ.73 కోట్లు పలికింది. ఇప్పుడు ఆ ధర దాదాపు రెండింతలు పెరిగింది


More Telugu News