డీకే శివకుమార్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన సిద్ధరామయ్య

  • కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ప్రచారం
  • మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యక్రమంలో పాల్గొన్నట్లు పేర్కొన్న సిద్ధరామయ్య
  • తాను ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందన్న డీకే శివకుమార్
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాల కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరులోగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 'ఎక్స్' వేదికగా ఆసక్తికరమైన పోస్టు చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో తామిద్దరం పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.

త్వరలో ఢిల్లీకి వెళ్లే అవకాశం

డీకే శివకుమార్ అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ, కొన్ని పెండింగ్ పనుల నిమిత్తం త్వరలో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నవంబర్ 20 నాటికి రెండున్నరేళ్లు పూర్తయింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారనే ఊహాగానాలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి.


More Telugu News