ఐ-బొమ్మ రవిపై ఐదు కేసులు.. మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు

  • రెండో కేసులో కోర్టులో హాజరుపరిచిన సైబర్ క్రైమ్ పోలీసులు
  • మిగిలిన మూడు కేసులకు సంబంధించి పీటీ వారెంట్ దాఖలు
  • కోర్టు అనుమతితో మిగిలిన మూడు కేసుల్లోనూ అరెస్టు చూపనున్న సైబర్ క్రైమ్ పోలీసులు
పైరసీ వెబ్‌సైట్ ఐ-బొమ్మ నిర్వాహకుడు రవికి నాంపల్లి కోర్టు మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ రోజు రవిని కోర్టులో హాజరుపరిచారు. రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఇదివరకే 5 కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం రెండో కేసులో అతడిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు.

మిగిలిన మూడు కేసులకు సంబంధించి కూడా పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో ఆ మూడు కేసుల్లోనూ అరెస్టు చూపనున్నారు. రవిని పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఇదివరకే పోలీసులు రవిని ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది.


More Telugu News