పెద్ద పేగు క్యాన్సర్‌కు పిప్పళ్లతో చెక్.. పరిశోధనలో కీలక ఆవిష్కరణ!
- పిప్పళ్లలోని పిప్లార్టైన్‌తో క్యాన్సర్ కణాల నాశనం
- కీమోథెరపీకి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే అవకాశం
- ఎన్‌ఐటీ రూర్కెల శాస్త్రవేత్తల బృందం అధ్యయనం
రూర్కెలలోని ఎన్‌ఐటీ పరిశోధకులు, బిహార్ సెంట్రల్ యూనివర్సిటీ, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాకు చెందిన బృందాలు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి. ప్రస్తుతం పెద్ద పేగు క్యాన్సర్‌కు కీమోథెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై పరిశోధన చేస్తున్న క్రమంలో శాస్త్రవేత్తలు ఈ కీలక విషయాన్ని కనుగొన్నారు.
పిప్లార్టైన్‌ను పెద్ద పేగు క్యాన్సర్ కణాలపై ప్రయోగించినప్పుడు అద్భుతమైన ఫలితాలు వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ ఆవిష్కరణ క్యాన్సర్ చికిత్సలో ఒక వరం లాంటిదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రముఖ సైన్స్ జర్నల్ 'బయోఫ్యాక్టర్స్'లో ప్రచురించారు.