మరోసారి ఆసుపత్రిలో చేరిన స్మృతి మంధన కాబోయే భర్త పలాశ్

  • వివాహ వేడుకల్లో అనారోగ్యానికి గురైన స్మృతి మంధన తండ్రి
  • అనంతరం పలాశ్ ముచ్చల్ కూడా అస్వస్థతకు గురైన వైనం
  • ఇన్‌ఫెక్షన్, అసిడిటీ కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స అనంతరం పలాశ్ డిశ్చార్జ్
  • ఈరోజు మరోసారి అస్వస్థతకు గురవడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరిక 
మహిళా క్రికెటర్ స్మృతి మంధన కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ మరోసారి ఆసుపత్రిలో చేరాడు. ఆమె తండ్రి అనారోగ్యానికి గురికావడంతో వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. అనంతరం పలాశ్ ముచ్చల్ వైరల్ ఇన్‌ఫెక్షన్, అసిడిటీ వల్ల ఇబ్బంది పడటంతో అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. పలాశ్ ఈరోజు మరోసారి అస్వస్థతకు గురవడంతో ముంబైలోని ఎస్‌వీఆర్ ఆసుపత్రికి తరలించినట్లు అతడి టీమ్ తెలిపింది.

ఫొటో షూట్‌ల కోసం వరుసగా ప్రయాణాలు చేయడం, ఇటీవల వరుసగా సంగీత్, ఇతర కార్యక్రమాల్లో నృత్యాలు చేస్తుండటం, సరైన నిద్ర లేకపోవడం, ఇతర కారణాల వల్ల పలాశ్ ఒత్తిడికి లోనై అస్వస్థతకు గురైనట్లు టీమ్ తెలిపింది.

స్మృతి తండ్రికి, పలాశ్‌కు మంచి అనుబంధం ఉందని, ఆదివారం ఆయన హఠాత్తుగా అనారోగ్యానికి గురవడాన్ని తట్టుకోలేకపోయిన పలాశ్ 4 గంటల పాటు ఏడుస్తూనే ఉన్నాడని ఆయన తల్లి పేర్కొన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అందువల్లే పలాశ్ ఆరోగ్యం క్షీణించిందని వెల్లడించింది.

స్మృతి మంధన, పలాశ్ ముచ్చల్ వివాహం నవంబర్ 23న బెంగళూరు వేదికగా జరగాల్సి ఉంది. అయితే వివాహ వేడుకల్లో పాల్గొంటుండగా స్మృతి తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వివాహం వాయిదా పడింది. ఆ తర్వాత పలాశ్ కూడా అనారోగ్యానికి గురయ్యాడు.


More Telugu News