నా ఎన్నిక గురించి ఆలోచించకండి.. నేను రాజీనామా చేయడం లేదు: కడియం శ్రీహరి

  • స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో శ్రీహరి
  • ప్రస్తుతం తన రాజీనామా గురించి ఆలోచించవద్దని సూచన
  • నిర్ణయం ఏదైనా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉంటుందన్న కడియం శ్రీహరి
కాబోయే సర్పంచ్‌లు స్టేషన్ ఘనపూర్ ఉప ఎన్నిక గురించి ఆలోచించవద్దని నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. తాను ప్రస్తుతం రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రస్తుతం ఎవరూ తన రాజీనామా గురించి ఆలోచించవద్దని సూచించారు.

ఎన్నికల అనర్హత పిటిషన్, తన రాజీనామా గురించి తర్వాత చూసుకుందామని తెలిపారు. తాను రాజీనామా చేయడం లేదని అన్నారు. సభాపతి ఏ నిర్ణయం తీసుకుంటారో చూశాక, తన ప్రణాళిక ఉంటుందని అన్నారు. నిర్ణయం ఏదైనా తనకు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉంటుందని, కార్యకర్తలు, నాయకుల సహకారం ఉంటుందని అన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కడియం శ్రీహరి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడియం శ్రీహరి సహా పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఫిర్యాదు చేయగా, హైకోర్టు ఆదేశాల మేరకు సభాపతి వారికి నోటీసులు జారీ చేసి వివరణ తీసుకుంటున్నారు.


More Telugu News