వాళ్లు అంగీకరిస్తే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటాను: సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు

  • అధిష్ఠానం నిర్ణయిస్తే తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని వెల్లడి
  • ముఖ్యమంత్రి మార్పుపై తుది నిర్ణయం కేంద్ర నాయకత్వంపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్య
  • అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉండాలని స్పష్టీకరణ
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్న వేళ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే ఐదేళ్లు తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి మార్పుపై తుది నిర్ణయం పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకుంటుందని అన్నారు.

అధిష్ఠానం తీసుకునే నిర్ణయాన్ని తాను, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సిద్ధరామయ్య ప్రకటించినప్పటికీ, తాజాగా అధిష్ఠానం నిర్ణయం శిరోధార్యమని చెప్పడం చర్చనీయాంశమైంది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిన తర్వాత సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయిన నేపథ్యంలో, డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు ఆయన ముఖ్యమంత్రి అవుతారనే తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల అధిష్ఠానాన్ని ఒప్పించేందుకు వారు ఢిల్లీకి వెళ్లినట్టు ప్రచారం జరిగింది.


More Telugu News