రేపటి నుంచి మూడు రోజులు సొంత నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన
- ఈ నెల 25, 26, 27 తేదీల్లో పులివెందులలో బస
- తొలిరోజు ప్రజాదర్బార్లో పాల్గొననున్న మాజీ సీఎం
- వివాహ వేడుక, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరు
షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 25వ తేదీ మధ్యాహ్నం జగన్ బెంగళూరు నుంచి హెలికాఫ్టర్ లో పులివెందులకు చేరుకుంటారు. అనంతరం పులివెందులలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమై వారి సమస్యలు, వినతులను స్వీకరిస్తారు.
నవంబర్ 26వ తేదీని పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమాలకు కేటాయించారు. స్థానిక నాయకుడి వివాహ వేడుకకు హాజరవడంతో పాటు మరికొందరిని వ్యక్తిగతంగా కలుసుకుంటారు. పర్యటన ముగించుకుని 27వ తేదీన పులివెందుల నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగి బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో పులివెందులలోని క్యాంప్ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.