ద‌క్షిణాఫ్రికాతో రెండో టెస్ట్.. తుది జట్టులోకి తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి

  • భారత్‌తో రెండో టెస్టులో టాస్ గెలిచిన ద‌క్షిణాఫ్రికా
  • మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించిన సఫారీ జట్టు
  • టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రిషభ్ పంత్
  • తుది జట్టులో నితీశ్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్‌కు చోటు
  • గిల్, అక్షర్ పటేల్‌లకు విశ్రాంతి
గువాహ‌టిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, ద‌క్షిణాఫ్రికా మధ్య నేడు జరుగుతున్న రెండో, ఆఖరి టెస్టులో సఫారీ జట్టు టాస్ గెలిచింది. కెప్టెన్ టెంబా బవుమా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరమవడంతో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ టీమిండియాకు సారథ్యం వహిస్తున్నాడు.

కాగా, ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో రెండు కీలక మార్పులు జరిగాయి. శుభ్‌మన్ గిల్‌ స్థానంలో తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి జట్టులోకి రాగా, అక్షర్ పటేల్ స్థానంలో బ్యాటర్ సాయి సుదర్శన్‌కు అవకాశం కల్పించారు. ఈ మ్యాచ్ ద్వారా పంత్, భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్సీ చేస్తున్న 38వ ఆటగాడిగా నిలిచాడు.

మరోవైపు ద‌క్షిణాఫ్రికా జట్టు కూడా ఒక మార్పుతో బరిలోకి దిగింది. పేసర్ కార్బిన్ బాష్ స్థానంలో స్పిన్నర్ సెనురన్ ముత్తుస్వామిని తుది జట్టులోకి తీసుకున్నారు.

భారత జట్టు:
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రిషభ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ద‌క్షిణాఫ్రికా జట్టు:
ఎయిడెన్ మార్‌క్రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, సెనురన్ ముత్తుస్వామి, సైమన్ హార్మర్, కేశవ్ మహరాజ్.


More Telugu News