మల్లు భట్టివిక్రమార్కను కలిసిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

  • నవంబర్ 27న హరిణ్య రెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ వివాహం
  • భట్టివిక్రమార్కను కలిసి వివాహ పత్రికను అందజేసిన రాహుల్
  • రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపిన మల్లు భట్టివిక్రమార్క
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో వివాహం చేసుకోనున్న రాహుల్, ఈ నెల 27న జరగబోయే తన వివాహానికి ఉప ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్‌కు భట్టివిక్రమార్క శుభాకాంక్షలు తెలియజేశారు.

అంతకుముందు, మంత్రి సీతక్కను కలిసిన రాహుల్ సిప్లిగంజ్ తన వివాహానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసి వివాహ పత్రికను అందజేసి ఆహ్వానించారు. రాహుల్ సిప్లిగంజ్, హరిణ్యరెడ్డిల నిశ్చితార్థం ఆగస్టులో జరిగిన విషయం తెలిసిందే.


More Telugu News