తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

  • 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ
  • పోలీసు శాఖలో ప్రధాన విభాగాలకు కొత్త సారథుల నియామకం
  • చౌహాన్‌కు అదనపు డైరెక్టర్ జనరల్ బాధ్యతలు
తెలంగాణలో భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ బదిలీలలో భాగంగా పోలీసు శాఖలోని ప్రధాన విభాగాలకు కొత్త సారథులను నియమించింది. చౌహాన్‌కు అదనపు డైరెక్టర్ జనరల్ (పర్సనల్) వంటి అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించింది.

మహేశ్వరం డీసీపీగా నారాయణరెడ్డి, ఏడీజీ (పర్సనల్‌) గా చౌహాన్, నాగర్ కర్నూలు ఎస్పీగా సంగ్రామ్ పాటిల్, వికారాబాద్ ఎస్పీగా స్నేహ మిశ్ర, భూపాలపల్లి ఎస్పీగా సంకేత్, మహబూబాబాద్ ఎస్పీగా శబరీశ్, వనపర్తి ఎస్పీగా సునీత, నార్కోటిక్ ఎస్పీగా పద్మలను బదిలీ చేసింది. మల్కాజ్‌గిరి డీసీపీగా శ్రీధర్, సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ ఖార్గే, టాస్క్‌ఫోర్స్ డీసీపీగా వైభవ్ గైక్వాడ్, సీఐడీ డీజీగా పరిమళ నూతన్, పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎం. చేతనలు నియమితులయ్యారు.


More Telugu News