ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివెల్‌లో బాలకృష్ణకు అరుదైన గౌరవం

  • నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలకృష్ణ
  • శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించిన గవర్నర్, సీఎం, కేంద్రమంత్రి
  • గోవాలో ఈ నెల 28 వరకు కొనసాగనున్న ఫిలిమ్ ఫెస్టివెల్
గోవా వేదికగా జరుగుతున్న 56వ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివెల్ ఆఫ్ ఇండియా వేడుకలో ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణను సత్కరించారు. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణకు ఈ అరుదైన గౌరవం లభించింది. గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి మురుగన్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆయనను శాలువాతో కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు.

ఈరోజు వైభవంగా ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివెల్ ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రారంభ వేడుకకు నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు హాజరయ్యారు. ముగింపు వేడుకలో సూపర్ స్టార్ రజనీకాంత్‌ను సత్కరించనున్నారు. ఆయన కూడా నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.


More Telugu News