తెలుగులో మాట్లాడండి: కలెక్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన
- త్వరలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం
- కలెక్టర్లు, మహిళా సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్
- ఇంగ్లీషులో మాట్లాడే ప్రయత్నం చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్
- స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నందున తెలుగులో మాట్లాడాలని సూచన
ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆంగ్లంలో వివరాలు వెల్లడించే ప్రయత్నం చేయగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుగజేసుకుని తెలుగులో మాట్లాడాలని అన్నారు. ఈ కాన్ఫరెన్స్లో స్వయం సహాయక సంఘాల సభ్యులు కూడా ఉన్నారని, వారందరికీ అర్థమయ్యేలా వీలైనంత వరకు తెలుగులో మాట్లాడాలని ఆయన సూచించారు. దీంతో కలెక్టర్ గరిమ తెలుగులో వివరాలు వెల్లడించారు.