రాజమౌళికి మద్దతుగా హైపర్ ఆది వ్యాఖ్యలు
- సోషల్ మీడియాలో సినీ ప్రముఖులపై ఇష్టానుసారంగా ట్రోల్స్ చేయడం దారణమన్న హైపర్ ఆది
- హనుమంతుడిని జక్కన్న అవమానించలేదని వెల్లడి
- వారణాసి ఈవెంట్‌లో జక్కన్న వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యల వివాదంపై నటుడు, రచయిత హైపర్ ఆది స్పందించారు. రాజమౌళికి ఆయన మద్దతుగా నిలిచారు. ‘ప్రేమంటే’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆది మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో సినీ ప్రముఖులపై ఇష్టానుసారంగా ట్రోల్స్ చేయడం దారుణమని అన్నారు.
వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి తన గ్లింప్స్ వీడియో ఆలస్యమైందని హనుమంతుడిపై అలిగారు తప్ప, ఆయన్ను అవమానించలేదని హైపర్ ఆది స్పష్టం చేశారు. భక్తి ఎక్కువైనప్పుడు దేవుడిపై అలిగే చనువు ఉంటుందని, దానిని తప్పుగా అర్థం చేసుకోవద్దని ఆయన వివరించారు. కావాలనే కొందరు సినీ సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేస్తున్నారని ఆది మండిపడ్డారు.
రాజమౌళి ఏ పోస్టర్ వదిలినా, అల్లు అర్జున్ నవ్వినా, చిరంజీవి, రామ్ చరణ్‌లపై .. ఇలా ప్రతీదానిపై ట్రోల్ చేయడం అలవాటుగా మారిందని, ఇది సరైన పద్ధతి కాదని హైపర్ ఆది హితవు పలికారు.
కాగా, వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. వీడియో ప్లే అవ్వడం ఆలస్యం కావడంతో ఆయన హనుమంతుడిని ఉద్దేశించి సరదాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే, ఈ వివాదంపై ఇప్పటి వరకు రాజమౌళి గానీ, ఆయన చిత్ర బృందం గానీ అధికారికంగా స్పందించలేదు.