రాజమౌళి, మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం.. ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు
- మహేశ్-రాజమౌళి సినిమా టైటిల్‌పై మొదలైన వివాదం
- 'వారణాసి' టైటిల్ తమదేనంటూ ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు
- తమ రిజిస్ట్రేషన్ పత్రాన్ని మీడియాకు విడుదల చేసిన ఫిర్యాదుదారు
వివరాల్లోకి వెళితే, సి.హెచ్. సుబ్బారెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్‌ను తాము ముందుగానే ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించామని, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని నిర్మాత విజయ్ కె. తెలిపారు. తమ అనుమతి లేకుండా రాజమౌళి తమ టైటిల్‌ను ఎలా ప్రకటిస్తారని ఆయన ప్రశ్నిస్తూ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. ఛాంబర్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ పత్రాన్ని కూడా వారు మీడియాకు విడుదల చేశారు.