ఈ జాకెట్ ఎక్కడ తయారైంది?... తన ప్రశ్నకు తానే సమాధానం చెప్పిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Reveals Jacket Origin Supports Andhra Handlooms
  • తన జాకెట్‌పై సోషల్ మీడియాలో క్విజ్ పెట్టిన లోకేశ్
  • సరైన సమాధానం చెప్పినవారికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ అని ప్రకటన
  • అయితే, బహుమతి ఎవరికీ దక్కలేదన్న మంత్రి
  • తన ప్రశ్నకు తానే సమాధానం చెప్పిన లోకేశ్
  • తూర్పు గోదావరి జిల్లా పులగుర్తలో తయారైందని వెల్లడి
  • ఏపీ చేనేత వస్త్రాలకు వినూత్నంగా ప్రచారం
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. తాను ధరించిన ఒక కొత్త జాకెట్‌కు సంబంధించి నెటిజన్లకు ఒక ప్రశ్న సంధించి, చివరికి ఆ ప్రశ్నకు తానే సమాధానం చెప్పి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ సంఘటన ద్వారా ఆయన ఏపీ చేనేత వస్త్రాలకు వినూత్నంగా ప్రచారం కల్పించారు.

వివరాల్లోకి వెళితే, విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు 2025లో పాల్గొన్న సందర్భంగా లోకేశ్ ఒక ప్రత్యేకమైన జాకెట్ ధరించారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ, "నా కొత్త జాకెట్ ఎలా ఉంది? ఇది దేనితో తయారు చేశారో ఊహించగలరా? సరైన సమాధానం చెప్పిన వారికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది" అంటూ #GuessAndWin హ్యాష్‌ట్యాగ్‌తో ఒక పోస్ట్ పెట్టారు. దీనిపై నెటిజన్ల నుంచి రకరకాల సమాధానాలు వచ్చాయి.

అయితే, ఆ తర్వాత కొద్దిసేపటికే లోకేశ్ మరో పోస్ట్ చేశారు. ఈసారి సర్‌ప్రైజ్ బహుమతి ఎవరికీ దక్కలేదని పేర్కొన్నారు. ఆ జాకెట్ మిలాన్ లేదా ముంబైలో తయారైంది కాదని, తూర్పు గోదావరి జిల్లా, అనపర్తి మండలం, పులగుర్త అనే ఒక చిన్న గ్రామంలో స్థానిక కళాకారులు చేతితో నేసినదని వెల్లడించారు. స్థానిక ఖాదీ, మల్ వస్త్రాల కలయికతో దీన్ని రూపొందించారని వివరించారు. ఈ పోస్ట్ ద్వారా #GoLocal, #AndhraHandlooms అంటూ స్థానిక ఉత్పత్తుల గొప్పతనాన్ని చాటిచెప్పారు.
Go Back to Shorts
Nara Lokesh
Andhra Pradesh
AP Minister
Pulagurtha
Handlooms
Khadi
Mul Fabric
CII Partnership Summit 2025
Anaparthi
East Godavari

More Telugu News