కోల్‌కతా టెస్టులో బ్యాటర్లు విఫలం.. 189 పరుగులకే భారత్ ఆలౌట్

  • తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే టీమిండియా ఆలౌట్
  • మెడ గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన కెప్టెన్ గిల్
  • భారీ స్కోర్లు చేయలేకపోయిన భారత బ్యాటర్లు
  • తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా స్కోరు 159 పరుగులు
  • భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 30 ప‌రుగులు స్వల్ప ఆధిక్యం
దక్షిణాఫ్రికాతో కోల్‌కతాలో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు 30 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో బౌలర్లు అద్భుతంగా రాణించినా, బ్యాటర్లు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. రెండో రోజు ఆటలో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకు ఆలౌట్ అయింది.

ఈ మ్యాచ్‌లో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ గాయం కారణంగా కేవలం మూడు బంతులు ఆడి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత అతను మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (39), వాషింగ్టన్ సుందర్ (29), రిషభ్ పంత్ (27), రవీంద్ర జడేజా (27) మంచి ఆరంభాలు అందుకున్నప్పటికీ, వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు.

అంతకుముందు తొలి రోజు ఆటలో భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 159 పరుగులకే కుప్పకూలింది. బౌలర్లు అందించిన పటిష్ఠ‌మైన పునాదిని బ్యాటర్లు నిలబెట్టలేకపోవడంతో భారత్ స్వల్ప ఆధిక్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.


More Telugu News