జూబ్లీహిల్స్ కౌంటింగ్... మూడో రౌండ్‌లో కూడా కాంగ్రెస్ ఆధిక్యత

  • కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు
  • మూడు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ ముందంజ
  • మూడో రౌండ్‌లో కాంగ్రెస్ కు 11,082 ఓట్లు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మూడు రౌండ్లు ముగిసే సమయానికి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ అభ్యర్థి భారీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం నాలుగో రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది.

ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కనబరుస్తోంది. మూడో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 11,082 ఓట్లు,  బీఆర్ఎస్‌కు 8,083 ఓట్లు రాగా, బీజేపీకి 1,866 ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్‌లో భాగంగా రెహమత్ నగర్, ఎర్రగడ్డ, వెంగళ్‌రావు నగర్ డివిజన్ల పరిధిలోని ఓట్లను అధికారులు లెక్కించారు.


More Telugu News