భారత బౌలింగ్ కోచ్ మోర్కెల్ ఇప్పుడు మాకు శత్రువు: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ స్మిత్ చమత్కారం
- నవంబర్ 14 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం
- కోల్‌కతాలో తొలి టెస్టు, గౌహతిలో రెండో మ్యాచ్
- మా జట్టుపై నమ్మకం ఉందన్న గ్రేమ్ స్మిత్
ప్రస్తుతం భారత్ బౌలింగ్ కోచ్‌గా ఉన్న దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ ఇప్పుడు తమకు శత్రువని సఫారీ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ చమత్కరించాడు. భారత్-దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 14 నుంచి రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ కోల్‌కతాలో, రెండో మ్యాచ్ గౌహతిలో జరగనుంది.
ఈ నేపథ్యంలో ముంబైలో జరిగిన 'ఎస్ఏ20 ఇండియా డే' కార్యక్రమంలో భారత్‌తో సిరీస్ గురించి గ్రేమ్ స్మిత్ మాట్లాడాడు. ఈ సమయంలో భారత బౌలింగ్ కోచ్‌గా ఉన్న తన మాజీ సహచరుడు మోర్నీ గురించి అడగగా పై విధంగా స్పందించాడు.
పేసర్లు కగిసో రబాడ, ఆల్ రౌండర్ కోర్బిన్ బాష్‌లకు తోడు కేశవ్ మహరాజ్, సేనురన్ ముత్తుస్వామి స్పిన్ ద్వయం భారత బ్యాటర్లకు సవాలు విసురుతుందని పేర్కొన్నాడు. ఈడెన్ గార్డెన్స్ మంచి గ్రౌండ్ అని, అక్కడే సిరీస్ ప్రారంభం కానుందని పేర్కొన్నాడు. తమ జట్టులో కేశవ్ మహరాజ్, ముత్తుస్వామి రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారని, వారు ఎంతో టాలెంటెడ్ అని తెలిపాడు. టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించాలంటే 20 వికెట్లు పడగొట్టడం చాలా ముఖ్యమైన విషయమని అన్నాడు. తమ జట్టుపై తనకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశాడు.