అలాంటి వాహనాలపై భారీగా పెనాల్టీ వేయండి: అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు
- నిబంధనలు ఉల్లంగిస్తున్న వాహనాలపై పెనాల్టీ విధించాలన్న మంత్రి
- ఓవర్ లోడింగ్ వాహనాలు సీజ్ అయ్యేలా కఠిన చర్యలు తీసుకోవాలని సూచన
- మహిళా ఆటోలకు అనుమతులు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నట్లు వెల్లడి
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై భారీగా పెనాల్టీ విధించాలని స్పష్టం చేశారు. ఓవర్ లోడింగ్ వాహనాలు సీజ్ అయ్యేలా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. బుధవారం ఆయన రవాణా శాఖపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రవాణా శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ నిరంతరం ఉండేలా ప్రణాళికను రూపొందించుకుని, దానిని నిక్కచ్చిగా అమలు చేయాలని అన్నారు. రాష్ట్రస్థాయిలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్ సేఫ్టీ మంత్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. మహిళా ఆటోలకు అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన అన్నారు.