ఈ వారం ఓటీటీలో సందడి చేసే తెలుగు సినిమాలివే!

  • 'నెట్ ఫ్లిక్స్'ఫ్లాట్ ఫామ్ పైకి 'డ్యూడ్'
  • ఈ నెల 14 నుంచి స్ట్రీమింగ్
  • అదే రోజున అదే ఫ్లాట్ ఫామ్ పై 'తెలుసుకదా'
  • 15వ తేదీన 'ఆహా' వేదికపై 'కె ర్యాంప్'

ఈ వారం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై తెలుగు సినిమాల సందడి కాస్త గట్టిగానే కనిపిస్తోంది. కలర్ ఫుల్ గానే అనిపిస్తోంది. ఈ వారం మూడు సినిమాలు ఓటీటీ తెరపైకి వస్తున్నాయి. ఈ మూడు సినిమాలు యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందినవి కావడమే విశేషం. వాటిలో ఒకటి 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోతే, మరో సినిమా ఫరవాలేదని అనిపించుకుంది. ఇంకో సినిమా ఓ మాదిరిగా ఆడింది అంతే. ఆ మూడు సినిమాలలో ఒకటి 'తెలుసుకదా'. 

సిద్ధూ జొన్నలగడ్డ కథానాయకుడిగా రూపొందిన సినిమానే 'తెలుసుకదా'. రొమాంటిక్ డ్రామాగా  రూపొందిన ఈ సినిమాలో... రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి నాయికలుగా కనువిందు చేశారు. నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్టోబర్ 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. థియేటర్ నుంచి ఈ సినిమా ఓ మాదిరి మార్కులను మాత్రమే సంపాదించుకోగలిగింది. ఈ నెల 14వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక 'డ్యూడ్' సినిమా అక్టోబర్ 17న విడుదలైంది. ప్రదీప్ రంగనాథన్ - మమిత బైజు జంటగా నటించిన ఈ సినిమా, 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్' ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. ఇక కిరణ్ అబ్బవరం - యుక్తి తరేజా ప్రధానమైన పాత్రలను పోషించిన 'కె ర్యాంప్' ఈ నెల 15వ తేదీ నుంచి 'ఆహా'లో అందుబాటులోకి రానుంది. ఓటీటీ వైపు నుంచి ఈ మూడు సినిమాలకి మంచి రెస్పాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. 



More Telugu News