మా ప్రభుత్వ లక్ష్యానికి నేడు కీలక ముందడుగు పడింది: మంత్రి నారా లోకేశ్
- రాష్ట్రవ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు శ్రీకారం
- 38 మెగా పరిశ్రమలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- యువతను పారిశ్రామికవేత్తలుగా చేస్తామన్న ముఖ్యమంత్రి
- ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని వెల్లడి
- గతంలో పారిపోయిన పరిశ్రమలు ఇప్పుడు మళ్లీ ఏపీకి వస్తున్నాయన్న లోకేశ్
- అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు, 38 పరిశ్రమలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నాడు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కనిగిరిలోని పెదఈర్లపాడులో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కుతో పాటు మిగిలిన వాటిని వర్చువల్‌గా ప్రారంభించారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు.
"ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి కల్పన లక్ష్యానికి నేడు ముందడుగు పడింది. రాష్ట్రవ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. 38 మెగా పరిశ్రమల్నీ సీఎం గారు ప్రారంభించారు. ఒక్క ఎంఎస్ఎంఈల ద్వారానే 5 లక్షల మంది యువతకు నేరుగా ఉద్యోగాలు లభిస్తాయి. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ముఖ్యమంత్రి గారి సంకల్పం ఈ ఎంఎస్ఎంఈల ద్వారా నెరవేరుతోంది. పరిశ్రమల ఏర్పాటుతో అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. గత పాలకుల వైఖరితో పరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోతే మేం అధికారంలోకి వచ్చాక ఏపీకి చలో చలో అంటూ పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయి" అంటూ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.