జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక... అందరికీ కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్
- మాగంటి సునీత గెలుపు కోసం కృషి చేశారంటూ కార్యకర్తలకు ప్రశంస
- నెల రోజులుగా శక్తివంచన లేకుండా పనిచేశారన్న కేటీఆర్
- అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా ఓటు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా స్పందించారు.
"గత నెల రోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా, భయభ్రాంతులకు గురిచేసినా బయటకు వచ్చి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు" అని ఆయన పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 58 మంది బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. ప్రధానంగా వీరి ముగ్గురి మధ్య పోటీ నెలకొంది. ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు కూడా వెలువడ్డాయి.