రితేష్ రానా దర్శకత్వంలో హీరోగా కమెడియన్‌ సత్య!

  • హీరోగా కమెడియన్‌ సత్య 
  • వినోదాత్మక కథాంశంతో కొత్త చిత్రం 
  • మత్తు వదలరా ఫ్రాంఛైజీగా నూతన చిత్రం
మత్తు వదలరా, మత్తు వదలరా-2 చిత్రాలతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న రితేష్ రానా తాజాగా తన నూతన చిత్రాన్ని మొదలుపెట్టారు. ఆయన దర్శకత్వంలో రాబోయే నాలుగో చిత్రంలో కమెడియన్ సత్య హీరోగా నటించనున్నారు. పూర్తి వినోదాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్‌లో జరిగాయి. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రాన్ని చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ద్వారా మిస్ యూనివర్స్ రియా సింఘా తెలుగులో నాయికగా పరిచయం కాబోతున్నారు. సత్యకు జోడీగా ఆమె ఈ చిత్రంలో నటించనున్నారు. మత్తువదలరా ఫ్రాంఛైజీలో భాగంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్, అజయ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. గతంలో రితేష్ రానా చిత్రాల తరహాలోనే ఇది పూర్తి ఫన్‌రైడ్‌గా ఉండబోతుందని మేకర్స్ తెలిపారు. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సురేష్ సారంగం ఫొటోగ్రఫీని అందిస్తున్నారు.  




More Telugu News