అనంతపురం జిల్లాలో మంత్రి నారా లోకేశ్ కు ఘనస్వాగతం
- అనంతపురం జిల్లాలో మంత్రి లోకేశ్ రెండు రోజుల పర్యటన ప్రారంభం
- పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న మంత్రికి ఘన స్వాగతం
- స్వాగతం పలికిన వారిలో మంత్రి పయ్యావుల, ఎంపీలు, ఎమ్మెల్యేలు
- రోడ్డు మార్గంలో కళ్యాణదుర్గం బయలుదేరిన నారా లోకేశ్
- దారి పొడవునా ప్రజలను పలకరించి అర్జీలు స్వీకరణ
- ధర్మవరంలో గజమాలతో స్వాగతం పలికిన తెలుగు యువత
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అనంతపురం జిల్లాలో తన రెండు రోజుల పర్యటనను శుక్రవారం ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీ నారాయణ సహా ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి లోకేశ్ రోడ్డు మార్గంలో కళ్యాణదుర్గం బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు రోజుల పర్యటన కోసం జిల్లాకు వచ్చానని, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను కలుసుకుంటానని తెలిపారు. మార్గమధ్యంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు.
లోకేశ్ పర్యటన దారి పొడవునా టీడీపీ శ్రేణులు, ప్రజలు ఆయనకు నీరాజనాలు పలికారు. ధర్మవరం పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలి వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో భారీ గజమాలతో ఆయనకు స్వాగతం పలికారు. అదేవిధంగా, రాప్తాడు నియోజకవర్గంలోని మామిళ్లపల్లి గ్రామంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశాయి. మంత్రి లోకేశ్‌కు స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు పల్లె సింధూరారెడ్డి, అమిలినేని సురేంద్రబాబు, కందికుంట వెంకట ప్రసాద్, దగ్గుబాటి వెంకట ప్రసాద్, బండారు శ్రావణి శ్రీ, ఎంఎస్ రాజు తదితరులు ఉన్నారు.