పెర్‌ప్లెక్సిటీకి ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ లీగల్ నోటీసులు.. ఎందుకంటే?

  • కామెట్ ద్వారా అమెజాన్‌లో షాపింగ్ చేసుకునే సదుపాయాన్ని నిలిపివేయాలని నోటీసు
  • అమెజాన్‌తో కలిసి పని చేయాలనుకున్నామన్న అరవింద్ శ్రీనివాస్
  • కామెట్ అసిస్టెంట్‌ను అమెజాన్ బ్లాక్ చేయడం యూజర్ల ప్రయోజనాలను దెబ్బతీయడమేనన్న సీఈవో
'ఏఐ' స్టార్టప్ పెర్‌ప్లెక్సిటీకి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ నోటీసులు పంపించడంపై పెర్‌ప్లెక్సిటీ సీఈవో స్పందించారు. సంస్థకు చెందిన ఏఐ ఆధారిత వెబ్‌బ్రౌజర్ కామెట్ ద్వారా అమెజాన్‌లో షాపింగ్ చేసుకునే సదుపాయాన్ని తక్షణమే నిలిపివేయాలని అమెజాన్ సూచించింది. దీనిపై పెర్‌ప్లెక్సిటీ సీఈవో స్పందించారు.

అమెజాన్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నామని, దీనివల్ల ఇరు సంస్థలకూ ప్రయోజనమని సీఈవో అరవింద్ శ్రీనివాస్ అన్నారు. అయితే, కామెట్ అసిస్టెంట్‌ను అమెజాన్‌లో బ్లాక్ చేయడమంటే యూజర్ల ప్రయోజనాలను దెబ్బతీయడమేనని ఆయన పేర్కొన్నారు.

పెర్‌ప్లెక్సిటీకి చెందిన వెబ్‌బ్రౌజర్ కామెట్‌లో యూజర్లు బ్రౌజర్ ద్వారా తమకు నచ్చిన వస్తువును కొనుగోలు చేయవచ్చు. ఇందులోని ఏఐ ఏజెంట్ యూజర్ల తరఫున వెబ్‌సైట్లలో సెర్చ్ చేసి, కొనుగోళ్లు చేయవచ్చు. ఈ సదుపాయాన్ని నిలిపివేయాలని అమెజాన్ పలుమార్లు హెచ్చరించింది. పెర్‌ప్లెక్సిటీ స్పందించకపోవడంతో తాజాగా లీగల్ నోటీసును పంపించింది.


More Telugu News