చేవెళ్ల బస్సు ప్రమాదం... బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు

  • బస్సు ప్రమాదానికి ప్రధాన కారణం రియల్ ఎస్టేట్ అన్న ఎంపీ
  • 2016లో బీజాపూర్ జాతీయ రహదారిని ప్రకటించారన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి
  • రియల్ ఎస్టేట్ కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేయకుండా వదిలేసిందన్న ఎంపీ
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదంపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ దుర్ఘటనకు రియల్ ఎస్టేట్ ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రమాదానికి పరోక్షంగా చాలామంది కారకులని ఆయన పేర్కొన్నారు. 2016లో బీజాపూర్ జాతీయ రహదారిని ప్రకటించినప్పటికీ, రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేయకుండా వదిలేసిందని ఆయన ఆరోపించారు.

నాడు బీఆర్ఎస్ లో ఉండి, నేడు కాంగ్రెస్ లో కొనసాగుతున్న గడ్డం రంజిత్ రెడ్డి కంపెనీల కోసం చేవెళ్ల రహదారి అలైన్‌మెంట్‌ను మార్చారని ఆయన ఆరోపించారు. భూసేకరణ చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు. బస్సు ప్రమాదానికి వంద శాతం గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన ఆరోపించారు. నాయకుల రియల్ ఎస్టేట్ దాహానికి ప్రజలు బలి అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News