శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం మంగోలియాకు మళ్లింపు

  • ఎయిరిండియా విమానం ఏఐ174 బోయింగ్ క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం
  • ముందస్తు జాగ్రత్తగా ఉలన్‌బాటర్‌లో సురక్షితంగా దిగిన విమానం
  • విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు సంస్థ వెల్లడి
శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దానిని మంగోలియాకు మళ్లించారు. ఎయిరిండియా విమానం ఏఐ 174 బోయింగ్ 777 ఎయిర్‌క్రాఫ్ట్‌ను ముందస్తు జాగ్రత్తగా ఉలన్‌బాటర్‌లో సురక్షితంగా దించినట్లు విమానయాన సంస్థ ప్రకటించింది.

విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఈ విమానం మధ్యాహ్నం 2.47 గంటలకు బయలుదేరింది. సోమవారం రాత్రి 9.59 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ కావాల్సి ఉంది. ఈ విమానం కోల్‌కతా మీదుగా ఢిల్లీకి రావాల్సి ఉంది.


More Telugu News