అన్నయ్య చిరంజీవికి అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్
- మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు దక్కడంపై సంతోషం
- అన్నయ్య ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడిన వైనం
- కమల్ హసన్, జయసుధ సహా అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు
- సినీ రంగానికి వారు చేసిన సేవలు ఎంతో విలువైనవని ప్రశంస
చిరంజీవితో పాటు వివిధ విభాగాల్లో పురస్కారాలకు ఎంపికైన సినీ ప్రముఖులకు కూడా పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. పైడి జైరాజ్, బి.ఎన్.రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి, టీఎల్ కాంతారావు, రఘుపతి వెంకయ్య, సి.నారాయణరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు గార్ల పేరిట ఉన్న పురస్కారాలకు ఎంపికైన కమల్ హసన్, సింగీతం శ్రీనివాసరావు, అశ్వినీదత్, ఆర్.నారాయణమూర్తి, రమేశ్ ప్రసాద్, సుద్దాల అశోక్ తేజ, జయసుధలకు ఆయన అభినందనలు తెలిపారు.
ఈ పురస్కారాలకు ఎంపికైన వారంతా చిత్ర పరిశ్రమకు అందించిన సేవలు ఎంతో విలువైనవని పవన్ పేర్కొన్నారు. అలాగే గద్దర్ పురస్కారాలకు ఎంపికైన వారికి కూడా పవన్ కల్యాణ్ తన అభినందనలు తెలియజేశారు.