భారత బౌలర్ పై సౌతాఫ్రికా కెప్టెన్ లారా ప్రశంసలు.. ఎవరిపైనంటే!
- అద్భుతంగా బౌలింగ్ చేసిందని మెచ్చుకోలు
- తమ జట్టు ఓటమికి కారణం ఆమె బౌలింగేనని వెల్లడి
- షెఫాలీ బౌలింగ్ ను అంచనా వేయలేకపోయామన్న లారా
ప్రపంచకప్ ఫైనల్ లో భారత జట్టుపై ఓటమి తర్వాత సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ భావోద్వేగానికి గురైంది. సెంచరీ సాధించినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోవడంతో కన్నీటిపర్యంతమైంది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ జట్టు ఓటమికి కారణాలను వెల్లడించింది. ఈ సందర్భంగా భారత జట్టు బౌలర్ షెఫాలీ వర్మపై లారా ప్రశంసలు కురిపించింది. షెఫాలీ అద్భుతంగా బౌలింగ్ చేసిందని కొనియాడింది. షెఫాలీకి బంతి ఇవ్వాలని హర్మన్ ప్రీత్ కౌర్ తీసుకున్న నిర్ణయం తమ కొంప ముంచిందని వెల్లడించింది. షెఫాలీ బౌలింగ్ ను తాము సరిగ్గా అంచనా వేయలేకపోయామని అంగీకరించింది.
‘షెఫాలీ బౌలింగ్ మాకు సర్‌ప్రైజ్. చాలా నెమ్మదిగా బంతిని సంధిస్తూ కీలక సమయంలో ఇద్దరిని పెవిలియన్ కు పంపించింది. కీలక వికెట్లను కోల్పోవడంతో మేం నిరుత్సాహానికి గురయ్యాం. ఆమెకు మరిన్ని వికెట్లు ఇవ్వకూడదని చాలా పొరపాట్లు చేశాం. వరల్డ్ కప్ ఫైనల్ వంటి మ్యాచుల్లో పార్ట్ టైం బౌలర్లకు వికెట్లు కోల్పోవడం సరికాదు. ఆమె బౌలింగ్ కోసం అస్సలు సన్నద్ధం కాలేదు’’ అని లారా వెల్లడించింది.