'ధమాకా'ను మించి 'మాస్ జాతర' సాగేనా?
- గతంలో 'ధమాకా' చేసిన రవితేజ - శ్రీలీల
- భారీ వసూళ్లను రాబట్టిన సినిమా
- తరువాత ప్రాజెక్టుగా చేసిన 'మాస్ జాతర'
- ఈ నెల 31వ తేదీన విడుదల
- అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు
చాలా కాలం తరువాత రవితేజ - శ్రీలీల కలిసి థియేటర్స్ కి వస్తున్నారు. ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన 'మాస్ జాతర' ఈ నెల 31వ తేదీన థియేటర్లకు రానుంది. 'ధమాకా' బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తరువాత వాళ్లిద్దరి నుంచి వస్తున్న సినిమా ఇది. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం మాస్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ - సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా, రిలీజ్ కి ముందే మంచి బజ్ తెచ్చుకుంది.
రవితేజకి మాస్ ఇమేజ్ పుష్కలంగా ఉందని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన స్టైల్ కి దగ్గరగా ఉండటం వల్లనే 'ధమాకా' ఆ రేంజ్ సక్సెస్ ను చూసిందని చెప్పచ్చు. తాను కూడా మాస్ కంటెంట్ ఉన్న సినిమాలలో సందడి చేయగలనని శ్రీలీల కూడా నిరూపించింది. అలాంటి ఈ ఇద్దరూ 'మాస్ జాతర' కోసం జోడీ కట్టారు. భీమ్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, థియేటర్ల దగ్గర సందడి చేయడం ఖాయమనే టాక్ బలంగానే వినిపిస్తోంది.
'ధమాకా' వంటి హిట్ తరువాత రవితేజ ఐదు సినిమాల వరకూ చేశాడు. అయితే ఆ సినిమాలేవీ ఆ స్థాయిలో హిట్ కాలేదు. ఇక శ్రీలీల కూడా 'ధమాకా' తరువాత తన జోరును కొనసాగించింది. కానీ 'భగవంత్ కేసరి' తరువాత ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో 'మాస్ జాతర' సక్సెస్ ఇద్దరి కెరియర్లోను కీలకంగా నిలిచింది. మరి ఈ సినిమా ఏ రేంజ్ వసూళ్లను రాబడుతుందనేది చూడాలి.