ఓటీటీలో ఎక్కువమంది చూస్తున్న హారర్ థ్రిల్లర్!

  • మలయాళ సినిమాగా 'సుమతి వలవు'
  • ప్రధానమైన పాత్రలో అర్జున్ అశోకన్ 
  • దెయ్యం నేపథ్యంలో సాగే కథ 
  • ఓటీటీ వైపు నుంచి భారీ రెస్పాన్స్ 
  
ప్రతి వారం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి హారర్ థ్రిల్లర్ .. హారర్ కామెడీ జోనర్ నుంచి చాలా సినిమాలు బరిలోకి దిగిపోతున్నాయి.  ఈ తరహా సినిమాలు కొన్ని విశేషమైన ఆదరణ పొందుతున్నాయి. ప్రేక్షకులు మళ్లీ మళ్లీ ఆ సినిమాలను చూడటానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. అలాంటి సినిమాల జాబితాలోకి 'సుమతి వలవు' చేరిపోయినట్టుగా చెబుతున్నారు. అర్జున్ అశోకన్ ప్రధానమైన పాత్రను పోషించిన మలయాళ మూవీ ఇది. 

విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, మాళవిక మనోజ్ ..గోకుల్ సురేశ్ .. బాలు వర్గీస్ .. సైజూ కురుప్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఆగస్టు 1వ తేదీన తెరపైకి వచ్చిన ఈ సినిమా, సెప్టెంబర్ 26వ తేదీనుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అడవిని ఆనుకుని ఉన్న ఒక విలేజ్ నేపథ్యంలో నడిచే ఈ కథ  ఆసక్తికరంగా కొనసాగుతుంది. 

చాలా కాలం క్రితం ఒక రోడ్డు మలుపులో గర్భవతి అయిన సుమతి అనే యువతి చంపబడుతుంది. అప్పటి నుంచి ఆమె దెయ్యమై అక్కడే తిరుగుతూ ఉందనీ, ఆ దారిన వెళుతున్న ఎంతోమందిని బలి తీసుకుందని గ్రామస్తులు నమ్ముతుంటారు. సుమతి ఎవరు? ఆమె ఎలా చంపబడింది?  అనేది మిగతా కథ. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన ఈ సినిమా, మొదటి నుంచి చివరివరకూ ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. అందువల్లనే ఈ కంటెంట్ పట్ల ఎక్కువ మంది ఆసక్తిని చూపుతున్నారని చెప్పచ్చు.



More Telugu News