చైనాకు పునః ప్రారంభమైన విమాన సర్వీసులు

India China Flights resume after 5 year gap
  • ఐదేళ్ల క్రితం చైనాకు నిలిచిపోయిన విమాన సర్వీసులు
  • ఐదేళ్ల విరామం తర్వాత కోల్‌కతా నుంచి చైనాకు బయలుదేరి వెళ్లిన ఇండిగో విమానం
  • ఇటీవలి పరిణామాలతో ఇరుదేశాల మధ్య మెరుగుపడిన ద్వైపాక్షిక సంబందాలు
ఐదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం భారత్ - చైనా మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. ఇండిగో సంస్థకు చెందిన విమానం 176 మంది ప్రయాణికులతో నిన్న కోల్‌కతా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుండి చైనాలోని గ్వాంగ్జౌ నగరానికి బయలుదేరింది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణలో ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే, 2020 మార్చి వరకు ఇరు దేశాల మధ్య విమాన రాకపోకలు నిరాటంకంగా కొనసాగాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందడం, ఆ తర్వాత తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ పరిణామాల ఫలితంగా భారత్ - చైనా మధ్య విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి.

గత కొంతకాలంగా విమాన సేవలను తిరిగి పునరుద్ధరించేందుకు ఇరు దేశాల అధికారులు పలుమార్లు చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని భారత విదేశాంగ శాఖ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగానే, మొదటి విమానం నిన్న కోల్‌కతా నుండి చైనాకు బయలుదేరింది. ఈ సర్వీసుల పునఃప్రారంభంతో వ్యాపారులు, విద్యార్థులు, పర్యాటకులకు ప్రయాణం సులభం కానుంది. 
Go Back to Shorts
India China flights
China flights
India flights
Kolkata
Guangzhou
flight services
India China relations
Covid pandemic
Galwan Valley

More Telugu News