పీసీబీ షాకింగ్ నిర్ణయం... టెస్ట్ కెప్టెన్ మసూద్‌కు బోర్డులో కీలక బాధ్యతలు
- పాక్ టెస్టు కెప్టెన్ షాన్ మసూద్‌కు డబుల్ ధమాకా
- పీసీబీ అంతర్జాతీయ క్రికెట్ కన్సల్టెంట్‌గా నియామకం
- కెప్టెన్‌గా కొనసాగుతూనే పరిపాలన బాధ్యతలు
పాకిస్థాన్ క్రికెట్‌లో ఓ అరుదైన పరిణామం చోటుచేసుకుంది. జాతీయ టెస్టు జట్టు కెప్టెన్‌గా ఉన్న షాన్ మసూద్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో కీలక పరిపాలన బాధ్యతలు అప్పగించారు. ఆయన్ను పీసీబీ "అంతర్జాతీయ క్రికెట్ వ్యవహారాల కన్సల్టెంట్‌గా" నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆటగాడిగా కొనసాగుతూనే బోర్డులో ఉన్నత పదవిని చేపట్టనుండటం పాక్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నిన్న ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో జరిగిన విందు సమావేశంలో పీసీబీ ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ ఈ నియామకాన్ని ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్ల ఆటగాళ్లు కూడా హాజరయ్యారు. వాస్తవానికి, పీసీబీ ఇటీవలే డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవికి ప్రకటన జారీ చేసింది. గతంలో ఈ పదవిలో ఉన్న ఉస్మాన్ వహ్ల, ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా జరిగిన "హ్యాండ్‌షేక్‌గేట్" వివాదంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆ తర్వాత ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుకున్నప్పటికీ, పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) విభాగానికి బదిలీ చేసి, ఆ స్థానంలో మసూద్‌కు అవకాశం కల్పించనున్నారు.
36 ఏళ్ల షాన్ మసూద్‌కు పాకిస్థాన్ తరఫున 44 టెస్టులు, 9 వన్డేలు, 19 టీ20లు ఆడిన అనుభవం ఉంది. నిజానికి ఈ పదవికి తొలుత మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, ఇతర వృత్తిపరమైన కమిట్‌మెంట్ల కారణంగా ఆయన ఈ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించారు. దీంతో పీసీబీ షాన్ మసూద్ వైపు మొగ్గుచూపింది.
అంతర్జాతీయ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ పదవికి కూడా మసూద్‌నే ప్రధాన అభ్యర్థిగా బోర్డు భావిస్తోంది. ఈ పదవికి దరఖాస్తుల గడువు నవంబర్ 2 వరకు ఉన్నప్పటికీ, ఇప్పటికే అంతర్గత సమీక్షలో మసూద్‌ను ఉత్తమ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు సమాచారం. "ప్రస్తుతానికి డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినా, ఆటగాడిగా అతను కొనసాగుతాడు. ఈ పదవికి కావాల్సిన అన్ని అర్హతలు అతనికి ఉన్నాయి" అని పీసీబీకి చెందిన ఓ అధికారి తెలిపారు.
జాతీయ జట్టు కెప్టెన్, బోర్డులో కీలక అధికారిగా షాన్ మసూద్ రెండు పాత్రలు పోషించడం ద్వారా మైదానంలోని ప్రదర్శనకు, బోర్డు పరిపాలనకు మధ్య సమన్వయం పెరుగుతుందని పీసీబీ ఆశిస్తోంది. ఇది పాకిస్థాన్ అంతర్జాతీయ క్రికెట్ కార్యకలాపాలను బలోపేతం చేస్తుందని బోర్డు విశ్వసిస్తోంది.