కర్నూలు బస్సు ప్రమాదంపై రష్మిక దిగ్భ్రాంతి.. 'ఆ బాధను ఊహించలేను' అంటూ ఆవేదన

  • కర్నూలు బస్సు ప్రమాదంపై స్పందించిన రష్మిక మందన్న
  • ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన నటి
  • సోష‌ల్ మీడియా ద్వారా తన ఆవేదన వెల్లడి
  • ప్రయాణికుల బాధ ఊహించడానికే భయంగా ఉందన్న రష్మిక
  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన నటి
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదంపై నటి రష్మిక మందన్న తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను ఎంతగానో కలచివేసిందని, ప్రయాణికులు పడిన వేదనను తలచుకుంటేనే భయమేస్తోందని ఆమె సోష‌ల్ మీడియాలో ఆవేదన వ్య‌క్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ ఘటనపై రష్మిక స్పందిస్తూ, "కర్నూలు బ‌స్సు ప్ర‌మాదం వార్త నా హృదయాన్ని కలచివేసింది. కాలిపోయే ముందు ఆ బస్సు లోపల ప్రయాణికులు ఎదుర్కొన్న బాధను ఊహించడానికి కూడా భయంగా ఉంది. ఇది నిజంగా భ‌యంక‌రం" అని తన పోస్టులో పేర్కొన్నారు. 

ఈ కష్టకాలంలో మృతుల కుటుంబాలకు తన ఆలోచనలు, ప్రార్థనలు ఎల్లప్పుడూ ఉంటాయని రష్మిక తెలిపారు. "ఈ దుర్ఘటనలో మరణించినవారి వారి ఆత్మలకు శాంతి చేకూరాలి" అని ఆమె పేర్కొంటూ మృతులకు నివాళులర్పించారు. కాగా, బస్సులో 46 మంది ప్రయాణికులు ఉండ‌గా, చాలామంది గాఢ నిద్రలో ఉన్న సమయంలోనే ఈ ఘోరం జరిగింది. 


More Telugu News