ఇంధనం లీకేజ్.. వారణాసిలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్

  • కోల్‌కతా నుంచి శ్రీనగర్ వెళుతున్న ఇండిగో విమానం
  • ఇంధనం లీక్ అయినట్లు గుర్తించి అత్యవసర ల్యాండింగ్ చేసిన పైలట్లు
  • ఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులు
కోల్‌కతా నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ఇంధన సమస్య తలెత్తడంతో పైలట్లు అప్రమత్తమై అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో ఇంధనం లీక్ అవుతున్నట్లు గుర్తించడంతో సిబ్బంది వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

కోల్‌కతా నుండి టేకాఫ్ అయిన తర్వాత లీకేజీని గుర్తించిన పైలట్లు, వారణాసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)ని అత్యవసర ల్యాండింగ్ కోసం అనుమతి కోరారు. దీంతో అధికారులు ల్యాండింగ్ కోసం రన్ వేను క్లియర్ చేశారు. సాయంత్రం 4:10 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలోని 166 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News