జూ.ఎన్టీఆర్ మార్ఫింగ్ ఫొటోలు.. సీపీ సజ్జనార్‌కు అభిమానుల సంఘం నాయకుడి ఫిర్యాదు

  • వ్యక్తిగత ప్రతిష్ఠ, పరువును దెబ్బతీసేలా పోస్టులు చేస్తున్నారని ఫిర్యాదు
  • అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను ప్రముఖ తెలుగు నటుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కలిసి ఫిర్యాదు చేశారు. తమ అభిమాన నటుడి ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ, ఆయన వ్యక్తిగత ప్రతిష్ఠను, పరువును దెబ్బతీసేలా పోస్టులు పెడుతున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాంటి వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ అభిమానుల సంఘం నాయకుడు నందిపాటి మురళి సీపీని కలిసి విజ్ఞప్తి చేశారు.

ఎన్టీఆర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన సీపీకి విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఉన్న అభ్యంతరకర పోస్టులను వెంటనే తొలగించేలా చూడాలని ఆయన కోరారు.


More Telugu News