మంటలు అంటుకుని దగ్ధమైన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు

  • నాదర్‌గుల్‌లో స్కూల్ బస్సులో మంటలు
  • అప్రమత్తమై బస్సు దిగిపోయిన డ్రైవర్
  • విద్యార్థులను ఇళ్ల వద్ద దింపి వెళుతుండగా ఘటన
హైదరాబాద్‌లోని నాదర్‌గుల్‌లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. బస్సు నుండి ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపి దిగిపోయారు. ఆ తరువాత బస్సు పూర్తిగా కాలిపోయింది. పాఠశాల ముగిసిన అనంతరం విద్యార్థులను వారి ఇళ్ల వద్ద దింపి తిరిగి వస్తుండగా కాటేదాన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

సమయానికి బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.


More Telugu News